పాముకాటుతో వృద్ధురాలు మృతి
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:05 AM
పాముకాటుతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఘట్‌కేసర్ రూరల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పాముకాటుతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ లింగాలకుంటకు చెందిన పెద్దపాక సాయమ్మ(72) స్థానికంగా ఓపెట్రోల్ బంక్‌లో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 11వ తేదీన సాయంత్రం పనిచేస్తుండగా పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను పెట్రోల్ బంకు సిబ్బంది ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయమ్మ చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.