బైక్ ఢీకొని వృద్ధుడికి గాయాలు
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:38 PM
రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిని బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ ఢీకొట్టాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఎస్‌బీఐ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.
ధారూరు, జనవరి 13: రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిని బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ ఢీకొట్టాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఎస్‌బీఐ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దోర్నాల్ గ్రామానికి చెందిన తానెం నర్సయ్య అనే వృద్ధుడు ధారూరు ఎస్‌బీఐలో డబ్బులు విత్‌డ్రా చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో ధారూరు పీఎస్ కానిస్టేబుల్ అనంతయ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నర్సయ్యను ఢీకొట్టాడు. దీంతో నర్సయ్య తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే 108 అంబులెన్స్‌లో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్‌పై వస్తున్న కానిస్టేబుల్ వృద్ధుడిని ఢీకొనడమే కాకుండా అతడే బైక్‌కు తగిలాడని స్థానికులతో బుకాయించి వెళ్లినట్లు సమాచారం. పెట్రోల్ పంపు, వైన్స్ షాప్, ఎస్‌బీఐ బ్యాంకు సీసీ కెమెరా పరిశీలిస్తే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుందని, ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ అనంతయ్యపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కుమారుడు సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.