రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:14 AM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం రాత్రి మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మరొకరికి తీవ్ర గాయాలు
మహేశ్వరం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం రాత్రి మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. యూపీకి చెందిన దీప్‌చంద్రకుమార్ (22), మనోజ్‌కుమార్(23)లు మండల పరిధిలోని మంఖాల్ పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పని చేస్తుంటారు. బుధవారం వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్రవాహనంపై కందుకూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి తుమ్మలూరు రెవెన్యూ మ్యాక్ ప్రాజెక్టు వద్ద ఎదురుగా వస్తున్న కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో దీప్‌చంద్రకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన మనోజ్ కుమార్‌ను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు అచ్చంపేటకు చెందిన పెద్ద కొత్తపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్‌దిగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.