Share News

రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:06 AM

ఆక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియాన్ని ఘట్‌కేసర్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసునమోదు చేశారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియాన్ని ఘట్‌కేసర్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసునమోదు చేశారు. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జోగ్యా తండాకు చెందిన గూగులోతు నందియా(58), గూగులోతు కిషన్‌(54)లు ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ, అవుషాపూర్‌లో 3.5క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కొనుగోలుచేసి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 12:06 AM