లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
ABN , Publish Date - Jan 15 , 2025 | 11:59 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆర్డీవో కె.జగదీశ్వర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుధారాణి సూచించారు.
ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ప్రత్యేక అధికారి సుధారాణి
కందుకూరు,జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆర్డీవో కె.జగదీశ్వర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుధారాణి సూచించారు. బుధవారం ఎంపీడీవో సరిత, తహసీల్దార్ కె.గోపాల్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందన్నారు. భూ సర్వే సమయంలో డిజిటల్ మ్యాప్ ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు దరఖాస్తులు చేసుకున్న వారి నివేదికలను ఇప్పటివరకు కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయలేదని, ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్తరేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికను ఈనెల 16 నుంచి 20వరకు గ్రామాల్లో పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీవో గీత, అధికారులు పాల్గొన్నారు.