Share News

‘స్పెషల్‌ శానిటేషన్‌’ అంతంతే!

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:17 AM

స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ అంటే ఇలాగే ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో చెత్తా చెదారం తొలగించారు. అయితే, ముందు శానిటేషన్‌ చేపట్టి వెనకాల విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

‘స్పెషల్‌ శానిటేషన్‌’ అంతంతే!
ఆసుపత్రి వెనకాల పెరిగిన పిచ్చిమొక్కలు

ఆసుపత్రి ఎదుట పరిశుభ్రత.. వెనకాల అపరిశుభ్రత

కేశంపేట పీహెచ్‌సీలో దుస్థితి..

కేశంపేట, జనవరి 1(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ అంటే ఇలాగే ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో చెత్తా చెదారం తొలగించారు. అయితే, ముందు శానిటేషన్‌ చేపట్టి వెనకాల విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో గురుకుల విద్యార్థులు విషజ్వరాలకు గురౌతున్న తరుణంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి నవంబరు 21 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో పంచాయతీ అధికారులు వారం రోజుల పాటు డ్రైవ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టి చెత్తా చెదారం, కలుపు మొక్కలు తొలిగించి శుభ్రం చేశారు. అయితే, ఆసుపత్రి ముందు ప్రాంతం శుభ్రంగా దర్శనమిస్తుండగా.. వెనకాల మాత్రం అపరిశుభ్రంగానే ఉంది. ఆ ప్రాంతంలో పిచ్చిమొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలు మొలిచాయి. దాంతో పాములు, ఎలుకలు తిరుగుతున్నాయని, ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన వారు చెబుతున్నారు. అంతేకాకుండా కీటకాల బెదడ ఎక్కువయ్యిందని చెబుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆసుపత్రి వెనకాల శుభ్రం చేయాలి

మండలాధికారుల స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టి చెత్తా చెదారం తొలిగించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆసుపత్రి వెనకాల పిచ్చిమొక్కలు మొలిచాయి. దాం తో అక్కడ పాములు, ఎలుకలు తిరుగుతున్నాయి. దాంతో ఆస్పత్రి సిబ్బంది, చికిత్స నిమిత్తం వచ్చేవారు భపడుతున్నారు. అధికారులు స్పందించి పిచ్చిమొక్కలు తొలగించాలి.

- సురేష్‌ మాదిగ, కోనాయపల్లి

మాదృష్టికి రాలేదు

కల్టెకర్‌ ఆదేశాల మేరకు ఆసుపత్రి ఆవరణలో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టి చెత్తాచెదారం, కలుపు మొక్కలు తొలగించాం. ఆసుపత్రి వెనకాల పిచ్చిమొక్కలు పెరిగిన విషయం మా దృష్టికి రాలేదు. పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో బిజీగా ఉన్నారు. వారం రోజుల్లో ఆసుపత్రిలో సానిటేషన్‌ చేపడతాం.

- రవిచంద్రకుమార్‌ రెడ్డి, ఎంపీడీవో, కేశంపేట

Updated Date - Jan 02 , 2025 | 12:17 AM