Share News

Teacher And Student: గురువుకు షాక్ ఇచ్చిన శిష్యురాలు.. చూడగానే ఎగిరి గంతేసి మరీ..

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:47 PM

Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్‌ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.

Teacher And Student: గురువుకు షాక్ ఇచ్చిన శిష్యురాలు.. చూడగానే ఎగిరి గంతేసి మరీ..
Moinabad Police station

ఆ ఇద్దరు గురుశిష్యులు. కానీ గురువు కంటే కూడా శిష్యురాలు గొప్ప పదవిని పొందారు. అంతే కాకుండా ఆ గురువు ఉన్న చోటే పై అధికారిగా నియమితులయ్యారు. తన వద్ద శిష్యురాలిగా ఉన్న వ్యక్తి ఇలా తనకంటే ఉన్నతస్థాయిలో ఉండటం చూసి ఆ గురువు భావోద్వేగానికి గురయ్యారు. ఒక గురువుకు ఇంతకంటే ఏం కావాలని చెప్పండి. ఇంతకీ ఈ గురుశిష్యుల స్టోరీ ఏంటి. వారు ఎక్కడ కలుసుకున్నారు. కటిక పేదవారైన వారిద్దరూ కూడా ఎలా ఇంతటి స్థాయికి వచ్చారో ఈ స్టోరీలో చూద్దాం. రంగారెడ్డి మోయినాబాద్‌లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్‌ ఆశ్చర్యచకితులయ్యారు. తన వద్ద చదువుకున్న తన శిష్యురాలు ఇలా కళ్ల ముందే ఇంతటి ఉన్నతాధికారినిగా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు లాల్యానాయక్. ఆమెకు సెల్యూట్‌ చేస్తూ సాదర స్వాగతం కూడా పలికారు.


లాల్యానాయక్‌ గురించి..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్‌ చిన్నప్పుడు నిరుపేదగా బతికారు. చదవుపై మక్కువ ఎక్కవగా ఉన్న లాల్యానాయక్‌ను ఆయన తండ్రి నాలుగో తరగతిలో ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించారు. దీంతో అక్కడే ఇంటర్ పూర్తి చేసిన ఆయన.. పాల్వంచలో డిగ్రీ చేశారు. ఆ తరువాత కూడా ఎంతో కష్టపడి ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి ఓ ప్రైవేటు కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. ఇలా సాఫీగా సాగుతున్న జీవితంలోకి కరోనా మహమ్మారి రావడంతో ఉన్న ఉపాధి కోల్పోయారు లాల్యానాయక్. కరోనా ఎఫెక్ట్‌తో లాల్యానాయక్ పనిచేస్తున్న కాలేజ్ మూతపడింది. దీంతో ఉన్న పని కూడా పోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు ఆయన. చివరకు ఓ నిర్ణయానికి వచ్చిన లాల్యానాయక్.. ప్రభుత్వ ఉద్యోగ వేటలో పడ్డారు. ప్రైవేటు ఉద్యోగాలతో ఎప్పుడూ చేటే అని భావించిన అతను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. చివరకు అనుకున్నది సాధించి.. 2020లో కానిస్టేబుల్‌లో ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

GHMC: ఎల్బీనగర్ ఘటనపై జీహెచ్‌ఎంసీ సీరియస్.. అనుమతులు రద్దు


ఇక జబీనాబేగం గురించి తెలుసుకుందాం..

జబీనాబేగం కుటుంబం కూడా నిరుపేద కుటుంబమే. చిన్నప్పటి నుంచి కూడా ఆమె చదువులో చురుగ్గా ఉన్నారు. ఈ క్రమంలో లాల్యానాయక్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలేజ్‌లోనే ఇంటర్‌లో చేరారు. ఆమెలో ఉన్న ప్రతిభను గుర్తించిన లాల్యానాయక్.. చదువు విషయంలో ఎంతో సహాయంగా ఉన్నారు. ఇంతలోనే ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్న సమయంలో జబీనాబేగంకు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న లాల్యానాయక్.. ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడి.. చదువు విషయంలో జబీనాబేగం ఎంత పట్టుదలతో ఉంటుందో వారికి చెప్పి పెళ్లిని రద్దు చేయించారు.


ఆ తరువాత జబీనాబేగం ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యే వరకు అండగా నిలిచారు లాల్యానాయక్. ప్రభుత్వం ఉద్యోగం గురించి ఆమెకు చెప్పి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేశారు. చివరకు గురువు శిక్షణలో ఎంతో విజయవంతగా జబీనాబేగం పోటీ పరీక్షలు రాసి.. 2024లో ఎస్సై పరీక్షలో అర్హత పొందారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని లాల్యానాయక్ పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో జబీనా బేగం ఎస్సైగా పోస్టింగ్ పొందారు. విషయం తెలుసుకున్న లాల్యానాయక్ ఆనందం అంతా ఇంతాకాదు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన తన శిష్యురాలికి స్వయంగా స్వాగతం పలికారు. అంతే కాకుండా ఆమెకు సెల్యూట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు లాల్యానాయక్. జబీనాబేగం, లాల్యానాయక్ గురుశిష్యులని తెలుసుకున్న పోలీస్‌స్టేషన్‌లోని తోటి కానిస్టేబుల్‌ కూడా వారికి అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

KTR: ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్


Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 04:47 PM