Share News

పెద్దేముల్‌లో మూడుచోట్ల చోరీ

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:04 AM

మండల కేంద్రంలో ఒకే రోజు మూడుచోట్ల చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వైన్‌షా్‌పలోని గల్లలో ఉన్న చిల్లర రూ.500 నగదుతో పాటు రెండు క్వార్టర్‌బాటిళ్లు, ఒక బీరును దొంగిలించారు.

పెద్దేముల్‌లో మూడుచోట్ల చోరీ

పెద్దేముల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఒకే రోజు మూడుచోట్ల చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వైన్‌షా్‌పలోని గల్లలో ఉన్న చిల్లర రూ.500 నగదుతో పాటు రెండు క్వార్టర్‌బాటిళ్లు, ఒక బీరును దొంగిలించారు. పక్కనే ఉన్న పర్మిట్‌రూంలో రూ.2వేలు నగదు, మరోచోట సోయబ్‌ అనే వ్యక్తి తన ఇంటిముందు పార్కింగ్‌చేసిన బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 12:04 AM