అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:37 PM
అప్పుల బాధ తాళలేక యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మూడుచింతలపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా రామయంపేట్‌కు చెందిన ప్రశాంత్ (26) బతుకుదెరువు నిమిత్తం తూంకుంటకు వచ్చి కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. తూంకుంటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైన వ్యక్తి పెట్రోల్ బంక్ పరిసరాల్లోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. సూసైడ్ నోట్‌లో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన భార్యను ఎవరూ ఏమీ అనొద్దని, కుటుంబసభ్యులు తనను బాగా చూసుకోవాలని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.