జలాధివాసం నుంచి బయటకు సంగమేశ్వరాలయం
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:15 AM
సప్త నదుల సంగమ క్షేత్రం నాగర్‌కర్నూలు జిల్లా, ఏపీ సరిహద్దులోని సంగమేశ్వరాలయం కృష్ణానది జలాధివాసం నుంచి గురువారం పూర్తిగా బయటపడింది.

ఈసారి 8 నెలల పది రోజులు వరద జలాల్లోనే...
కొల్లాపూర్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): సప్త నదుల సంగమ క్షేత్రం నాగర్‌కర్నూలు జిల్లా, ఏపీ సరిహద్దులోని సంగమేశ్వరాలయం కృష్ణానది జలాధివాసం నుంచి గురువారం పూర్తిగా బయటపడింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో 8 నెలల పది రోజులపాటు జలాధివాసంలో ఉన్నా చెక్కు చెదరని ఆలయ శిల్పసంపదను వీక్షిస్తూ భక్తులు మైమరిచిపోతున్నారు. గురువారం ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామయ్య శర్మ గర్భాలయంలో వేపదార శివలింగం, దేవతా విగ్రహమూర్తులకు తొలి పూజలు నిర్వహించారు. ఆలయం వరద జలాల నుంచి బయటపడిందని తెలియడంతో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు దర్శనానికి వస్తున్నారు.