తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేవ్: సీతక్క
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:19 AM
పల్లెల్లో తాగునీటి సమస్యలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కొందరి రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి అనసూయసీతక్క ఆరోపించారు.

హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో తాగునీటి సమస్యలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కొందరి రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి అనసూయసీతక్క ఆరోపించారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, గతంలో తాగునీరందని గ్రామాలకూ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి పరిస్థితులపై శుక్రవారం మిషన్ భగీరథ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తప్పుడు ప్రచారం చేస్తే తిప్పికొట్టాలని, నిజంగా ఇబ్బందులుంటే తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.