Siddipet: కేసీఆర్ అవినీతిని వెలికి తీసేందుకే పాదయాత్ర
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:18 AM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీయడమే లక్ష్యంగా తాను ‘పోరుబాట’ పాదయాత్ర చేపట్టినట్లు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు.

సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీయడమే లక్ష్యంగా తాను ‘పోరుబాట’ పాదయాత్ర చేపట్టినట్లు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం చేపట్టిన పాదయాత్ర రెండో రోజు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద మొదలై కుకునూరుపల్లి మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల, రిమ్మనగూడ, గజ్వేల్‌లో కొనసాగింది.
కొడకండ్లలో నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీల్లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గడిచిన 15నెలల్లో ఒక్కసారి కూడా ఇక్కడి ప్రజల సమస్యలపై దృష్టిపెట్టలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు తీర్చని పక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.