Answer Sheets: టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:14 AM
పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం భౌతిక, రసాయన శాస్త్రం పరీక్ష నిర్వహించగా ఖమ్మం జిల్లా కారేపల్లి మోడల్ స్కూల్ కేంద్రంలో పరీక్ష రాసిన

సీల్ వేసిన బ్యాగు చిరిగి బయటపడ్డ ఆన్సర్ షీట్లు
ఖమ్మం ఖానాపురం హవేలి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం భౌతిక, రసాయన శాస్త్రం పరీక్ష నిర్వహించగా ఖమ్మం జిల్లా కారేపల్లి మోడల్ స్కూల్ కేంద్రంలో పరీక్ష రాసిన 187 మంది విద్యార్థుల జవాబు పత్రాలను విద్యాశాఖ అధికారులు సీల్ వేసి స్థానిక పోస్టాఫీసులో అప్పగించారు.
తపాలా అధికారులు వాటిని ఖమ్మం కొత్త బస్టాండ్‌కు పంపించగా అక్కడ ఆర్టీసీ కార్గో పాయింట్ వద్ద దించుతుండగా బ్యాగు జారి పడి చిరగడంతో జవాబు పత్రాలు బయటపడ్డాయి. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, డీఈవో సోమశేఖర శర్మ బస్టాండ్‌కు చేరుకుని జవాబు పత్రాలను పరిశీలించారు. అవన్నీ సక్రమంగా, సురక్షితంగానే ఉన్నాయని నిర్ధారించుకుని తిరిగి సీల్ వేయించారు.