Damodara Rajanarasimha: అవయవ దానం బిల్లుకు ఆమోదం
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:33 AM
తెలంగాణ రాష్ట్ర అవయవ దానం బిల్లు-2025కు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2011లో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు.

ఎవరైనా అవయవాల వ్యాపారం చేస్తే... కోటి దాకా జరినామా, పదేళ్ల వరకు జైలు
దాతల కుటుంబాలకు ఆదుకునేందుకు విధానం రూపొందిస్తాం: దామోదర
హైదరాబాద్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అవయవ దానం బిల్లు-2025కు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2011లో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు. దీన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు వారి మనుమలకు అవయవ దానం చేసేందుకు కొత్త చట్టం అనుమతి ఇస్తుందని తెలిపారు. అవయవ మార్పిడి విషయంలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే గతంలో రూ.5 వేల జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేదని, ఇప్పుడు రూ.కోటి వరకు జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినట్లు ధ్రువీకరించే అధికారం గతంలో న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్లకు మాత్రమే ఉండేదని, ఇప్పుడు ఫిజీషియన్లు, సర్జన్లు, అనస్థీషయన్లకు కూడా ఆ అధికారం లభిస్తుందన్నారు. గుండె, కిడ్నీ, కాలేయంతో పాటు చర్మం, ఎముక మజ్జ(బోన్ మారో), గుండె వాల్వుల మార్పిడి కొత్త చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ఈ చట్టంతో ఇతర రాష్ట్రాల్లోని అవయవ మార్పిడి వ్యవస్థలతో తెలంగాణ అనుసంధానం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను ఇక్కడి పేషెంట్లకు అమర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ‘అవయవాలు, కణజాల సేకరణ, స్టోరేజీ కేందాల్రు ఏర్పాటు అవుతాయన్నారు.
ఇది మెడికల్ టూరిజంకు దోహదపడుతుందని తెలిపారు. అవయవ దాతలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న సభ్యుల సూచనపై మంత్రి స్పందిస్తూ సీఎంతో చర్చించి విధానం రూపొందిస్తామని చెప్పారు. అవయవ దానం బిల్లుకు బీఆర్‌ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అవయవదానం పత్రాలపై ఎమ్మెల్యే సంతకాల కోసం అసెంబ్లీలో కార్యక్రమం నిర్వహించాలని, మొదట తానే సంతకం చేస్తానని తెలిపారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 3,724 మంది అవయవ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ బిల్లు వారికి ఎంతో ఊరటనిస్తుందన్నారు. ప్రభుత్వం అవయవ దాతల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సూచించారు. ఆ దాత కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలని, పేద కుటుంబమైతే ఇందిరమ్మ ఇల్లు, పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటివ్వాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మిత్రసేన కిడ్నీ వ్యాధి బారినపడినప్పుడు తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడినా.. నిబంధనల వల్ల కుదర్లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ అవయవాల వ్యాపారాన్ని కట్టడి చేయడానికి నిఘా అవసరమన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News