Share News

Telangana: పోలీసులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుకగా ప్రమోషన్లు..!

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:23 PM

తెలంగాణ ప్రభుత్వం 1989 మరియు 1990 బ్యాచ్‌లో ఎంపికైన కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా వారికి గుడ్ న్యూస్ అందించింది. ఆ బ్యాచ్‌లో కానిస్టేబుళ్లగా ఎంపికైన వారు ప్రస్తుతం ఏఎస్సైలు‌గా పని చేస్తున్నారు.

Telangana: పోలీసులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుకగా ప్రమోషన్లు..!
Telangana Police

తెలంగాణ ప్రభుత్వం 1989 మరియు 1990 బ్యాచ్‌లో ఎంపికైన కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా వారికి గుడ్ న్యూస్ అందించింది. ఆ బ్యాచ్‌లో కానిస్టేబుళ్లగా ఎంపికైన వారు ప్రస్తుతం ఏఎస్సైలు‌గా పని చేస్తున్నారు. అలా మొత్తం 187 మంది హైదరాబాద్ రీజియన్‌లో ఏఎస్సైలుగా పని చేస్తున్నారు. వారందరికీ ఎస్సైలుగా పదోన్నత్తులు కల్పించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశించారు.


డీజీపీ ఆదేశాలకు మేరకు ప్రమోషన్లు ఇస్తూ మల్టీ జోన్ - 2 ఐజీపీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఆ 187 మంది ఏఎస్సైలు తాజాగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే వారికి పదోన్నత్తులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 10 , 2025 | 06:23 PM