Share News

రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:02 AM

ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్‌, ఆది శ్రీనివాస్‌ అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో మార్కెట్‌ కమిటీ పాలక వర్గ ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు.

 రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం
ప్రమాణస్వీకారం చేస్తునన మార్కెట్‌ కమెటీ పాలక వర్గం

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

మేడిపల్లి, జసవరి 7(ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్‌, ఆది శ్రీనివాస్‌ అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో మార్కెట్‌ కమిటీ పాలక వర్గ ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు దేశ చరిత్రలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేసిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గెలిచిన సంవత్సరం లోపే మోత్కురావుపేట చందుర్తి రోడ్డు ని ర్మాణానికి అనుమతులు తెచ్చామన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి మం డల కేంద్రంలో రూ 34 లక్షల 50 వేల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాచారం గ్రామంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదం వినోద్‌కుమార్‌ యాదవ్‌, పార్టీ అధ్యక్షుడు సింగరెడ్డి నరేష్‌రెడ్డి, రమేష్‌రె డ్డి, చేపూరి నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, జలందర్‌రెడ్డి, కొమురయ్య, బలగం రాజేష్‌, దాసరి శంకర్‌, ఉరుమడ్ల నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 01:02 AM