Tirumala: తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు?
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:05 AM
తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిళ్లను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని 2020లో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి, గాజు సీసాలు ప్రవేశపెట్టారు.

గాజు సీసాల స్థానంలో అనుమతించే యోచనలో టీటీడీ
తిరుమల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిళ్లను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని 2020లో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి, గాజు సీసాలు ప్రవేశపెట్టారు. లీటర్ బాటిల్ రూ.50. వినియోగం తర్వాత ఏ దుకాణంలో తిరిగి రూ.30లు వెనక్కి ఇస్తారు. అయితే చాలామంది బాటిళ్లను వెనక్కివ్వకుండా పడేస్తున్నట్టు గుర్తించారు. ఇవి పగిలి ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఏవైనా గొడవలు జరిగిన సమయంలో కొందరు భక్తులు గాజు సీసాలను ఆయుధాలుగా వాడేస్తున్నారు. దీంతో గాజు సీసాల స్థానంలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బాటిళ్లు, టెట్రా వాటర్‌ప్యాకెట్ల వినియోగంపై టీటీడీకి కొన్ని సంస్థలు ఇప్పటికే టీటీడీకి డెమో ఇచ్చాయి. వీటి వినియోగంపై పరిశీలనకు ఓ ప్రత్యేక కమిటీని ఈవో శ్యామలరావు నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.