Share News

Ramzan:వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..

ABN , Publish Date - Mar 31 , 2025 | 10:12 AM

వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లోనూ మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.

Ramzan:వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..
Miniser Konda Surekha

వరంగల్: రంజాన్‌ (Ramzan) పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులను (Mosques) ప్రార్థనల (Prayers) కోసం సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో గల ఈద్గాల వద్ద ప్రార్థనల కోసం చేసిన ఏర్పాట్లను పోలీసులు, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించారు. ప్రజలంతా సోదరభావంతో పండుగను నిర్వహించుకోవాలని నాయకులు, అధికారులు కోరారు. అలాగే ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో వరంగల్ (Warangal) ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు (Muslim Brothers) ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ (Miniser Konda Surekha)ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లోనూ మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.

Also Read..: బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..


మరో ఆరు రోజులు..

ఉపవాసాలు, దానధర్మాలు, ప్రత్యేక నమాజ్‌లు, ఆరాధనలతో రంజాన్‌ మాసం ముగిసింది. తనపట్ల భక్తిని, నమ్మకాన్ని మరింత పటిష్టపరచుకొనే అవకాశాన్ని విశ్వాసులకు అల్లాహ్‌ అనుగ్రహించాడు. దీనికి కొనసాగింపుగా... రంజాన్‌ మాస ఉపవాసాలను పూర్తి చేసిన తరువాత... తదుపరి మాసమైన షవ్వాల్‌లో ఆరు రోజులు ఉపవాసాలు చేసే సంప్రదాయం ఉంది. సాధారణంగా... ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ జరుపుకొన్నాక... రెండో రోజు నుంచి ఈ ఉపవాసాలను పాటిస్తారు. ఎవరైతే రంజాన్‌ ఉపవాసాలు చేసి, ఆ తరువాత షవ్వాల్‌ మాసంలో ఆరు రోజులు ఉపవాసాలు ఉంటారో... వారు ఏడాదంతా ఉపవాసాలు చేసినట్టేనని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. రంజాన్‌ ఉపవాసాలను, షవ్వాల్‌ ఉపవాసాలను పాటించిన వారు తల్లి గర్భంలోంచి అప్పుడే పుట్టినంత పవిత్రులవుతారని, వారు ఎప్పుడూ ఉపవాసాలు పాటిస్తున్నవారిగా పరిగణన పొందుతారని హదీస్‌ గ్రంథం చెబుతోంది. ఎల్లప్పుడూ ఉపవాసం పాటించడం గురించి తనకు ఎదురైన ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు దైవ ప్రవక్త సమాధానం ఇస్తూ ‘‘రంజాన్‌ ఉపవాసాలతో పాటు తరువాతి నెలలోని (ఆరు రోజుల) ఉపవాసాలను కూడా పాటించు. అలాగే బుధ, గురువారాల్లో ఉపవాసం ఉండు. దీనివల్ల నువ్వు ఎల్లప్పుడూ ఉపవాసాలు పాటించేవాడిగా పరిగణన పొందుతావు’’ అని చెప్పారు. ‘‘ఎవరైనా రంజాన్‌ మాసమంతా ఉపవాసాలు ఉంటే... అతనికి పది నెలల పుణ్యం వస్తుంది. షవ్వాల్‌లోని ఆరు రోజుల ఉపవాసాల వల్ల అరవై రోజుల పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా పన్నెండు నెలలు... అంటే ఏడాది కాలం ఉపవాసాలు చేసినంత పుణ్యం వారికి దక్కుతుంది’’ అని దివ్య గ్రంథాలు పేర్కొంటున్నాయి. కాగా, ‘‘రంజాన్‌ మాసంలో చేసిన ఉపవాసాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే... షవ్వాల్‌ ఉపవాసాల ద్వారా ఆ పొరపాట్లను అల్లాహ్‌ మన్నిస్తాడు. నమాజ్‌లలో ఏర్పడిన లోపాలను తొలగిస్తాడు’’ అని పూర్వ ఉలేమాలు (ఇస్లాం గురువులు) స్పష్టం చేశారు.


ట్రాఫిక్ మళ్లింపు..

కాగా జాన్ శోభరం జాన్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ముఖ్యమైన ఈద్గాలు, ప్రార్థనా మందిరాల వద్ద ఉదయం 7.00 నుంచి 11.30 వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. బహదూర్‌పురా, కాలపత్తార్‌, నవాబ్‌ సాహెబ్‌ కుంట, శాస్త్రీపురం, దానమ్మ హట్స్‌, మాసబ్‌ట్యాంక్‌, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 10:13 AM