వివేకానందుడిని స్ఫూర్తితో ముందుకు సాగాలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:18 AM
ప్రపంచానికి గొప్ప సం దేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానం దుడిని యువత స్పూర్తిగా తీసు కుని ముందుకు వెళ్లాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజ య్ పిలుపునిచ్చారు.
ఫ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్
కోరుట్ల, జనవరి 11 (ఆంరఽధ జ్యోతి) : ప్రపంచానికి గొప్ప సం దేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానం దుడిని యువత స్పూర్తిగా తీసు కుని ముందుకు వెళ్లాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజ య్ పిలుపునిచ్చారు. పట్టణం లోని శ్రీసరస్వతి శిశుమందిర్ పా ఠశాలలో జాతీయ యువజన ది నోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరై మాట్లాడా రు. తల్లిదండ్రులు, గురువులు సూచించిన మార్గంలోనే పయనిం చాలని సూచించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, హైందవ మత కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప యోధుడైన వివేకా నందుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యా ర్థులు వివేకానందుని ఆశయాలు, ఆలోచ నల గురించి నాటక రూపంలో చేసిన ప్రదర్శన ఆ కట్టుకుంది. జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెం దిన విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమ తులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరెడ్డి హరిష్మర ణరెడ్డి, బొడ్ల శ్రీనివాస్, ప్రబంధ కారిణి అ ధ్యక్షుడు వేముల రవికిరణ్, ఉపాధ్యక్షుడు రాజ గంగాధర్, ప్రధాన ఆచార్యులు గోపు వెంకటేశ్, ఆచార్య బృందం పాల్గొన్నారు.