Share News

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

ABN , Publish Date - Jan 15 , 2025 | 11:32 PM

కొల్లాపూర్‌ కేంద్రంలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆవాజ్‌ కెవిపిఎస్‌ ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో 4వ వార్డులో మంగళ వారం ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిం చారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో వేసిన ముగ్గులు

డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ వర్మ

కొల్లాపూర్‌/వంగూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్‌ కేంద్రంలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆవాజ్‌ కెవిపిఎస్‌ ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో 4వ వార్డులో మంగళ వారం ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్‌ జిల్లా నాయ కులు ఎండి సలీం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ వర్మ మాట్లాడుతూ... సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలు నిర్వ హించడం ఆనవాయి వస్తోందన్నారు. నేటి పా లకులు మహిళలను అన్ని రంగాలలో ముం దుండే విధంగా ప్రోత్సహించాలని వారు కోరా రు. మొదటి బహుమతి రాణి, రెండవ బహు మతి మహేశ్వరి, మూడవ బహుమతి పూర్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కట్ట శ్రీనివాసులు మాట్లాడితే ఇలాంటి ప్రోగ్రాములు ముందు ముందు మరొక జరపాలని ఆయన అన్నారు. ప్రజా సంఘాల నాయకులు కెవిపిఎస్‌ మండల కార్యదర్శి రాజు, మండల ఉపాధ్యక్షులు సంజీవ్‌, నాని, సాయి, శ్రీహరి, కార్తీక్‌, చందు, రాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వంగూరు మండలం జాజల గ్రామంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న ముఖ్య అథితిగా హాజ రయ్యారు. విజేతలకు ఆయన బహుమతుల ను అందజేశారు. కార్యక్రమంలో పరశురాము లు, బాలస్వామి, బాల్‌రెడ్డి, ఆంజనేయులు, అశోక్‌ జిలుకర పరశురాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2025 | 11:32 PM