పంచాయతీల్లో పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:59 AM
పంచాయతీల్లో పనులు మ రింత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారు లను ఆదేశించారు.
కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో పనులు మ రింత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారు లను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కా ర్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇతర అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఎంపీడీవో, ఎంపీ వోలు ప్రతీ రోజు వారి మండలాల గ్రామ పంచాయతీలను సందర్శించి కార్యదర్శులు చేపడుతున్న పనులను పరిశీలించాలని ఆదేశించారు. వం ద శాతం ఇంటి పన్నులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జి ల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్‌డీవో, డీపీవో, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.