ఏపీ మద్యం స్కాంపై అమిత్ షా ఆరా
ABN, Publish Date - Mar 26 , 2025 | 09:04 AM
హైదరాబాద్‌కు చెందిన ఎన్.సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను లావు శ్రీకృష్ణదేవరాయలు, అమిత్ షాకు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం (AP Liquor Scam) వ్యాపారం జరిగిందని టీడీపీ ఎంపీ (TDP MP) లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) లోక్‌సభ (Lok Sabha)లో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) దృష్టి సారించారు. పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆయనను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోనం నీటిబొట్టంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. రూ 90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ. 18వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అవి కాకుండా మరో రూ. 4వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై అమిత్ షా ఆరా తీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: ప్రేమలో ఉన్నవారు ఈ తప్పులు చేయొద్దు..
ఈ వార్తలు కూడా చదవండి..
పాపవినాశనంలో బోటింగ్‌పై వివాదం..
అవినాశ్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్
For More AP News and Telugu News
Updated at - Mar 26 , 2025 | 09:04 AM