జగన్ ఇప్పుడు ఆపగలవా..

ABN, Publish Date - Jan 08 , 2025 | 07:55 PM

విశాఖపట్నంలో బుధవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.2.08లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఇవాళ (బుధవారం) రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. నక్కపల్లి (Nakkapalli) వద్ద బల్క్ డ్రగ్ పార్క్ కోసం రూ.1,877 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నానికి రూ.2,300 కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. విశాఖ (Visakha) మహానగరంలో నేడు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతోపాటు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈరోజు రూ.6,177 కోట్లతో ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రూ.5,718 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించినట్లు వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్‌ కల సాకారమైందని, గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు కేటాయించి నగరవాసుల చిరకాల కల విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. రూ. 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశామని, రూ.3,044 కోట్లతో 234 కి.మీ. పొడవైన ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Updated at - Jan 08 , 2025 | 07:55 PM