విజయవాడకు మహర్దశ.. పరుగులు పెట్టనున్న మెట్రో..

ABN, Publish Date - Jan 01 , 2025 | 02:00 PM

కూటమి ప్రభుత్వంలో విజయవాడ(Vijayawada) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే నగారానికి మరో మణిహారం రూపుదిద్దుకుంటోంది. విజయవాడకు మెట్రోస్టేషన్ల (Vijayawada Metro)ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అమరావతి: కూటమి ప్రభుత్వంలో విజయవాడ (Vijayawada) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే నగారానికి మరో మణిహారం రూపుదిద్దుకుంటోంది. విజయవాడకు మెట్రోస్టేషన్ల (Vijayawada Metro)ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా రెండు కారిడార్లకు సంబంధించి మెట్రోస్టేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మెుదటి కారిడార్‌లో 22 మెట్రోస్టేషన్లు, రెండో కారిడార్‌లో 12 స్టేషన్లను నిర్మించబోతున్నారు. మెుదటిది గన్నవరం బస్‌స్టేషన్ నుంచి బీఎన్‌బీఎస్ వరకూ.. రెండోది పెనమలూరు సెంటర్ నుంచి పీఎన్‌బీఎస్ వరకూ నిర్మించనున్నారు. తర్వాతి దశలో రాజధాని అమరావతికి విస్తరించే కారిడార్-3ని నగరంలోని పీఎన్‌బీఎస్‌కి అనుసంధానం చేయనున్నారు.

Updated at - Jan 01 , 2025 | 02:00 PM