ఇది గేమ్ ఛేంజర్ అవుతుంది: భట్టి
ABN, Publish Date - Apr 18 , 2025 | 02:02 PM
బొగ్గుతోపాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ అందరికంటే ముందు ఉన్న సింగరేణి సంస్థ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలను మొదలుపెట్టింది.
హైదరాబాద్: సింగరేణి (Singareni) సమయానుకూలంగా మారుతోంది. అవసరానికి తగ్గట్లుగా కొత్త రూట్లు వెతుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఒడిషా (Odisha)కు విస్తరించింది. ఈ క్రమంలో తొలిసారి రాష్ట్రం దాటింది. ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో పెరగనున్నాయి. తెలంగాణ సిరుల తల్లి సింగరేణి విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తరిగిపోతున్న బొగ్గు నిల్వలకు ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాల్లో కోల్ మైన్స్‌ను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఓపెన్ కాస్ట్ మైన్స్ అన్నిటి కంటే అతి పెద్దదైన బహుబలి గని నైనీ కోల్ బ్లాక్‌లో తవ్వకాలకు శుభారంభం పలికింది. బొగ్గు ఉత్పత్తిలోనూ.. అనుబంధ కార్యకలాపాల్లోనూ ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అంటున్నారు.
Also Read..: పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..
బొగ్గుతోపాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ అందరికంటే ముందు ఉన్న సింగరేణి సంస్థ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలను మొదలుపెట్టింది. ఒడిషా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకును డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డ్ ధరలు పెరగడానికి కారణం ఇదే..
బీసీసీఐ సీరియస్..ముగ్గురిపై చర్యలు..
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
For More AP News and Telugu News
Updated at - Apr 18 , 2025 | 02:02 PM