సైఫ్ అలీ ఖాన్‌కు 6 కత్తి పోట్లు

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:06 PM

దుండగుడి దాడిలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్‌కు ఆరు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు. సైఫ్‌కు సర్జరీ చేస్తున్నారని, మీడియా అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.

ముంబై: దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్‌కు ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. సైఫ్‌పై గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. దొంగను గమనించిన సైఫ్ ఆలీఖాన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు.


ఈ విషయాన్ని సైఫ్ ఆలీఖాన్ కుటుంబసభ్యులు ఓ స్టేట్‌మెంట్‌లో ధృవీకరించారు. దుండగుడి దాడిలో సైఫ్‌కు ఆరు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనకు ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు. సైఫ్‌కు సర్జరీ చేస్తున్నారని, మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రేక్ దర్శనం టికెట్స్ కోసం గూగుల్ పే..

శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన..

గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 16 , 2025 | 01:06 PM