పవన్ ఆదేశాలను పట్టించుకోలేదుగా..

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:30 PM

Pawan Kalyan Orders Ignored: స్యయంగా అధినేత ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదు జనసేన నేతలు. ఇటీవల చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. అయితే ఆ తరువాతే చిత్రాడ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కాకినాడ, మార్చి 19: జిల్లాలోని చిత్రాడలో నాలుగు రోజుల క్రితం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే చిత్రాడ ప్రజలకు మాత్రం ఈ సభ నిర్వాహణ తర్వాత అంతులేని కాలుష్యాన్ని మిగిల్చింది. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ధి చేసి, ఫ్లెక్సీలు తొలగించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఆదేశాలను పార్టీ నేతలెవరూ పట్టించుకోలేదు. జనసేన సభ తర్వాత ప్రాంగణంలో నిండిపోయిన చెత్తను తొలగించేందుకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు అయ్యింది. అయితే సభ మరుసటి రోజు సభాప్రాంగణాన్ని శుద్ధి చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చి జనసేన నేతలు వెళ్లిపోయారు.


పవన్ సొంత శాఖలోని ఉపాధి హామీ కూలీలతో చెత్తను సేకరించి అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. ప్లాస్టిక్ వ్యర్ధాలకు మంట పెట్టడంతో భారీగా కాలుష్యం వెలువడింది. దీంతో తీవ్ర కాలుష్యంతో చిత్రాడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ జనసేన నిర్వహించిన సభా ప్రాంగణంలో ఫ్లెక్సీలు కూడా తొలగించలేదు.


ఇవి కూడా చదవండి...

Marri Rajasekhar Resigns: మర్రి రాజశేఖర్‌కు బుజ్జగింపులు.. ఇదే ఫైనల్ అన్న ఎమ్మెల్సీ

Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..

Read Latest AP News And Telugu News

Updated at - Mar 19 , 2025 | 02:30 PM




News Hub