భారత టెలికాం రంగంలో సంచలన ఒప్పందం..

ABN, Publish Date - Mar 12 , 2025 | 11:04 AM

న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో సంచలన ఒప్పందం జరిగింది. ఎలాన్ మస్క్‌తో ముఖేష్ అంబానీ డీల్ కుదుర్చుకున్నారు. స్పేస్ ఎక్స్‌తో రిలయ్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్ లింక్ భారత్‌లో సేవలను అందించనుంది.

The video is not available or it's processing - Please check back later.

న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో (Indian Telecom) సంచలన ఒప్పందం (Agreement) జరిగింది. ఎలాన్ మస్క్‌ (Elon Musk)తో ముఖేష్ అంబానీ (Mukesh Ambani) డీల్ (Deal) కుదుర్చుకున్నారు. స్పేస్ ఎక్స్‌ (SpaceX) తో రిలయ్స్ జియో (Reliance Jio) ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్ లింక్ భారత్‌లో సేవలను అందించనుంది. ఇప్పటికే భారత్‌లోని తన కష్టమర్లకు స్టార్ లింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ఎయిర్ టెల్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఇప్పుడు స్పేస్ ఎక్స్‌తో జియో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనంగా మారింది.

Also Read..:

ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్


అయితే స్టార్ లింక్ సేవలకు అవసరమైన లైసెన్స్ దరఖాస్తును భారత ప్రభుత్వం ఇంకా సమీక్షిస్తోంది. స్టార్‌లింక్‌ మాతృసంస్థే స్పేస్‌ఎక్స్‌. ప్రధాని మోదీ గత నెలలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా మస్క్‌తోనూ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా స్పేస్‌, మొబిలిటీ, టెక్నాలజీ, ఆవిష్కరణలు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత కొద్ది వారాలకే మస్క్‌ కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ భారత్‌లోకి ప్రవేశించేందుకు వేగంగా పావులు కదుపుతుండటం గమనార్హం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ పరిసరాల్లో గట్టి భద్రతా చర్యలు..

ఏపీలో వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు

అన్ని కేసుల్లో పోసానికి బెయిల్.. విడుదలకు బ్రేక్..

For More AP News and Telugu News

Updated at - Mar 12 , 2025 | 11:04 AM