ఎస్ఆర్‌హెచ్‌ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ

ABN, Publish Date - Apr 01 , 2025 | 07:07 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్ఆర్‌హెచ్‌) యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

హైదరాబాద్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) వివాదంపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) స్పందించింది. ఎస్ఆర్‌హెచ్‌ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేవలం క్లబ్ కార్యదర్శుల కోసం మాత్రమే టికెట్లు అడిగామని చెప్పింది. ఎస్ఆర్‌హెచ్‌‌లో కొందరు ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) సీరియస్ (Serious) అయ్యారు. విజిలెన్స్‌ విచారణకు ( Vigilance Inquiry) ఆదేశించారు. ఎస్ఆర్‌హెచ్‌ తీరు సరిగా లేదని, మొదట జరిగిన ఒప్పందానికి.. తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధంలేదని హెచ్‌సీఏ పేర్కొంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ఉచితంగా పాస్‌ల కోసం డిమాండ్ చేశారన్న దాంట్లో వాస్తవం లేదని కేవలం 3,900 పాస్‌లు ఇస్తామని చెప్పి 2,500 పాస్‌లు ఇచ్చారని హెచ్‌సీఏ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ ఉపాధి.. బాబు చేయూత: పురందేశ్వరి

వేతనజీవులకు పన్ను ఉపశమనం

For More AP News and Telugu News

Updated at - Apr 01 , 2025 | 07:07 AM