మళ్లీ రచ్చకెక్కిన రాజ్ తరుణ్, లావణ్య..
ABN, Publish Date - Apr 16 , 2025 | 09:02 PM
సినీ నటులు రాజ్ తరుణ్, లావణ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తన ఇంటిపై రాజ్ తరుణ్ కుటుంబసభ్యులు దాడి చేశారంటూ నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: సినీ నటులు రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య(Lavanya) వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తన ఇంటిపై రాజ్ తరుణ్ కుటుంబసభ్యులు దాడి చేశారంటూ నార్సింగి పోలీసుల(Narsingi Police)కు లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 10 మందితో కలిసి తన ఇంటిపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే తన కుమారుడు విల్లాలోనే లావణ్య ఉంటోందని యువనటుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. లావణ్య తమను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపారు. కాగా, లావణ్య ఆరోపణలతో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఇరువురు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Updated at - Apr 16 , 2025 | 09:02 PM