సీతారామ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం

ABN, Publish Date - Apr 06 , 2025 | 10:36 AM

భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది.

భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ (Sita Ramula Kalyanam) మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియం (Mithila Stadium)లోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్‌ లగ్నం (Abhijit Lagna)లో కల్యాణం జరుగుతుంది. ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,800 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసింది. దేవస్థానం భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ విచ్చేయనున్నారు. ఏబీఎన్ లైవ్ చూడండి.

Also Read..: ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలు


భద్రాద్రి రామయ్యకు టీటీడీ పట్టువస్త్రాలు

శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..

20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..

ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

For More AP News and Telugu News

Updated at - Apr 06 , 2025 | 10:36 AM