బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల దూకుడు
ABN, Publish Date - Apr 21 , 2025 | 01:54 PM
ఇటీవల కవిత దూకుడుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదల అయ్యాక కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు. తొలుత బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాలపై ఆమె కార్యక్రమాలు నిర్వించారు. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా తెరమీదకు తీసుకువచ్చారు.
హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల మధ్య పోటీ తీవ్రమైందా.. ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఒకరిని మించి మరొకరు తమ మాటల్లో స్పీడ్ పెంచుతున్నారా.. ప్రజా అటెన్షన్ కోసం కేసీఆర్ (KCR) అంత మంచివాళ్లం కాదంటూ పదే పదే ఎందుకు అంటున్నారు. ఇవే కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో అన్నా చెల్లెళ్ల దూకుడుపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదంటూ కేటీఆర్ కామెంట్స్ (KTR Comments) చేస్తుంటే.. ఆయన సోదరి కవిత (Kavita) మరో అడుగు ముందుకు వేసి తనను తాను ఏకంగా రౌడీ టైపు’ అంటూ ప్రకటించారు. వారిద్దరి స్పీచ్ చూసి పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Also Read..: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం..
ఇటీవల కవిత దూకుడుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదల అయ్యాక కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు. తొలుత బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాలపై ఆమె కార్యక్రమాలు నిర్వించారు. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా తెరమీదకు తీసుకువచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం భగ భగ.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్..
తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
For More AP News and Telugu News
Updated at - Apr 21 , 2025 | 01:54 PM