తిరుమలకు గోల్డ్ మ్యాన్..

ABN, Publish Date - Jan 01 , 2025 | 02:48 PM

ఓ భక్తుడు భారీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారి చెంతకు వచ్చారు.

తిరుమల: ఓ భక్తుడు భారీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమల (Tirumala) స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ (Konda Vijay Kumar) 5 కిలోల బంగారు ఆభరణాలు (5 kg of gold ornaments) ధరించి శ్రీవారి చెంతకు వచ్చారు. విజయ్ ధరించిన ఆభరణాలు చూసేందుకు తోటి భక్తులు ఆసక్తి కనబరిచారు. అంత పెద్దమెుత్తంలో పసిడిని ఆయన ఒంటిపై వేసుకోవడంతో భక్తులు అవాక్కయ్యారు. అదంతా నిజమైనదేనా అంటూ విజయ్‌ను ప్రశ్నించారు. అయితే బంగారంపై ఉన్న ఆసక్తితోనే 5 కిలోలతో ఆభరణాలు చేయించుకున్నానని, అదంతా నిజమైన బంగారమేనని తోటి భక్తులకు విజయ్ చెప్పారు.

Updated at - Jan 01 , 2025 | 02:48 PM