మాస్ కాపీయింగ్.. ఐదుగురు డిబార్
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:59 PM
Tenth Exams Mass Copying: పదో తరగతి పరీక్సల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు.

శ్రీకాకుళం, మార్చి 22: జిల్లాలోని టెన్త్ పరీక్షల్లో (10th Exams) మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న పరీక్షా కేంద్రాలపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎచ్చెర్లలోని కుప్పిలిలో ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ అలీఖాన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇంగ్లీష్ పరీక్షలో పెద్దఎత్తున మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్‌లతో పాటు మొత్తం 14 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇవి కూడా చదవండి
Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇంత అంతా సులువే
CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..
Read Latest AP News And Telugu News