ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..
ABN, Publish Date - Feb 28 , 2025 | 08:36 AM
2019లో అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ ఏం చేశారో గుర్తుతెచ్చుకుందాం.. పదవిలో కూర్చున్నది మొదలు... కక్ష సాధింపులు.. తొలి ఆరు నెలల్లోనే... ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వేధింపులు.. అధికారం అంతానికి వచ్చేసరికి... చంద్రబాబు అరెస్టు.. మధ్యలో... ఎంత మందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కే లేదు.
అమరావతి: రెడ్ బుక్ రాజ్యాంగం (Red Book Constitution).. వైఎస్ జగన్ (YS Jagan) పదే పదే కలవరిస్తున్న పదం.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. అన్ని రకాల హక్కులకు పాతరేసి.. నోరెత్తితే అరెస్టులు (Arrests) చేసి.. ఫేస్ బుక్‌లో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు హింసించారు. అర్ధరాత్రి గోడలు, గేట్లు దూకి మరీ విపక్ష నేతలను అరెస్టు చేయించి.. ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రహదారి మార్గంలో తీసుకువెళ్లి నరకం చూపించిన జగన్.. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాపోతున్నారు. తన ఐదేళ్ల హయాంలో చేసిన అరాచకాలన్నీ మరిచిపోయి.. మళ్లీ వస్తాం.. అన్నీ నోట్ చేసుకుంటున్నాం.. బట్టలూడదీసి నిలబెడతామని కూడా జగన్ హెచ్చరిస్తున్నారు. అంటే అధికారంలో ఉంటే అరాచకం రాజ్యమేలాలి. విపక్షంలో ఉంటే మాత్రం ధర్మం నాలుగు పాదాలు నడవాలి. ఇది జగనిజం..
ఈ వార్త కూడా చదవండి..
పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..
2019లో అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ ఏం చేశారో గుర్తుతెచ్చుకుందాం.. పదవిలో కూర్చున్నది మొదలు... కక్ష సాధింపులు.. తొలి ఆరు నెలల్లోనే... ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వేధింపులు.. అధికారం అంతానికి వచ్చేసరికి... చంద్రబాబు అరెస్టు.. మధ్యలో... ఎంత మందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కే లేదు.. ఇప్పుడు అదే జగన్... అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్న కేసుల్లో ఒకరిద్దరు అది కూడా ఓ మోస్తరు నాయకులను అరెస్టు చేయగానే ‘అన్యాయం, అక్రమం’ అని వాపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పోసాని రిమాండ్‌పై న్యాయవాది పొన్నవోలు ఎమన్నారంటే..
హరీశ్.. మాట్లాడేందుకు సిగ్గుండాలి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 28 , 2025 | 08:36 AM