Home » Andhra Pradesh » Ananthapuram
నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు గడువులోగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అనంతపురం బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోర్టు వద్ద నుంచి క్లాక్ టవర్ మీదుగా డీఐజీ కార్యాలయం వరకు వెళ్లారు.
వన హాస్పిటల్ వన విలేజ్‌లో ప్రతిఒక్కరికీ ఉచితంగా వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టరు వినోద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయుష్మానభారతపై శుక్రవారం ఆయన సమీక్షించారు.
అగ్రిగోల్డ్ భూముల్లో వచ్చే ఆదాయాన్ని ఏటా చెరి సగం పంచుకుందామని విజయవాడలోని ఓ అధికారికి వైసీపీ నాయకుడు బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.
రేషన బియ్యం సక్రమంగా అందడం లేదంటూ పట్టణంలోని 10వ వార్డు మహిళలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు.
బాల్యవివాహాలు చట్టరీత్యానేరమని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. పట్టణంలోని నందలపాడులో ఉన్న మోడల్స్కూల్లో గురువారం కిశోరి వికాసం- బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు అని, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని మెచ్చిరి గ్రామంలో గురువారం తహసీల్దార్ నాగ రాజు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా కాలవ శ్రీనివాసులు పా ల్గొని మాట్లాడారు.
నూతనసంవత్సరంలో న్యాయంకోసం పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి, పోలీస్ మార్కు కనిపించాలని ఎమ్మెల్యే పల్లె సిందూరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
మండలంలోని కునుకుంట్ల పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్య క్తులు పాఠశాల ఆవరణ లో ఎనుముకు సంబంధించిన పుర్రె, కాళ్ల ఎముకలు ముగ్గుపై ఉంచి పసుపు కుంకుమ చల్లి క్షుద్రపూజలు నిర్వహించారు.
నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులకు సూచించారు.