Home » Andhra Pradesh » Ananthapuram
క్రిస్టియన్లకు కూ టమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మండలంలోని రాచానపల్లిలోని యేసు కృపా మందిరంలో బుధవారం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.
గత వైసీపీ హయాంలో ఏ కార్యాలయంలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి, ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు. మండలంలోని గంగినేపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొం టున్న భూసమస్యలపై పలువురు రైతులు ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు.
జింకల బారి నుంచి పంటలను కాపాడతామని జిల్లా అటవీ అధికారి విజ్ఞేష్ తెలిపారు. మండలంలోని పెద్ద కొట్టాల పల్లి గ్రామ పరిధిలోని వివిధ రకాల పంటలను మంగళవారం ఆయన పామిడి షెక్షన అధికారి, పందికుంట బీట్ అధికారి సతీ్షతో కలిసి పరిశీలించారు.
రెవెన్యూ సదస్సుల్లో రైతులు అర్జీల ద్వారా తెలిపిన భూ సమస్యల్ని నిశితంగా పరిశీలించి 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆర్డీఓ వసంతబాబు తెలిపారు. మండలంలోని దుద్దేకుంట గ్రామంలో మంగళవారం రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సును నిర్వహించారు.
మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు.
ఉపాధి హామీ పథకం నిధులతో అటవీశాఖలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. మొక్కలు నాటడం, నగరవన సుందరీకరణ తదితర అంశాలపై కలెక్టర్ మంగళవారం జిల్లా అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ప్రియాంకనగర్లో పుట్టపర్తి రహదారి పక్కనగల కాంప్లెక్స్లోని నాలుగు దుకాణాల్లో చోరీ చేశారు. షట్టర్లను ఇరువైపులా వంచి, తాళాలను పక్కకు జరిపి లోపలకు చొరబడ్డారు.
మండల వ్యాప్తంగా అక్రమ లే అవుట్లు వేశారు. వాటిలోకి వేల టిప్పర్ల గ్రావెల్ను అక్రమంగా తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వ, మాన్యం భూములను అడ్డదిడ్డంగా తవ్వేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచుకున్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినన బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్లో మంగళవారం కోరారు. 2017లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు.
జైళ్లలో ఏళ్లుగా మగ్గిపోతున్న వయోవృద్ధులకు విముక్తి కల్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శ్రీకారం చుట్టిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.