Home » Andhra Pradesh » Ananthapuram
విద్యయా అమృత మశ్నుతే అంటూ ఎదిమిది దశాబ్దాల క్రితం సిరివరం ఆదినారాయణ రావు ఏర్పాటుచేసిన ఎస్ఎస్బీఎన కళాశాల విద్యార్థుల కు వరంగా మారింది. 1944లో ఓ గుడిసెలో పా ఠాల బోధనతో ప్రారంభమైన కళాశాల నేడు మర్రి మానులా విస్తరించింది. ఈ ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది.
నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో తహసీ ల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో ప్రజ సమస్యల పరిష్కారం జఠిలంగా మారిందని ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కీలకమైన ఆర్ఐ లేక పోవడం తో సర్టిఫికెట్ల జారీలో అలస్యం అవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిసిస్తున్నాయి.
గత జగన్ ప్రభుత్వ పాలనలో ఆర్ డబ్ల్యు ఎస్, ఏపీ ఐఐసీ పరిధిలో రూ.6 కోట్ల కాంట్రాక్టు పనులు జనార్దన్ రెడ్డి చేశారు. పనుల కోసం తెలిసిన వారి నుంచి రూ.4.5 కోట్ల అప్పు చేశాడు. రావాల్సిన బిల్లులు పెండింగ్లో వుండటంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కాంట్రాక్టర్.. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆప కుంటే......రైతులతో కలసి ఉద్య మిస్తామని సీపీఐ, రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద శని వారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శనివారం శింగనమలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథ కాన్ని ప్రారంభించా రు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియన కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చాలామంది అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్న లేకున్నా పరి టాల రవీంద్ర భార్యగా ఈ ప్రాంతానికి సేవ చేస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారం భించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లాకు డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఓ వరంలాంటి దన్నారు.
మండల పరిధిలోని అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్డు నుంచి నూతనంగా తలుపూరు గ్రామానికి చేపట్టిన తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి మండలంలో అతి వేగంగా పూర్తికానున్న తారురోడ్డ కావడంతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
: ప్రజోపకార్యాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా స్వాహా చేశారు. పంచాయతీ ప్రజాప్రతినిధికి కొందరు నాయకులు తోడై ప్రజల సొమ్మును మింగేశారు. స్తానిక పంచాయతీ నిధులు పక్కదారి పట్టిన విషయం బయటికి పొక్కడంతో శనివారం పెనుకొండ డీఎల్పీఓ శివనారాయణరెడ్డి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.
ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా ఈనెల 7న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.