Home » Andhra Pradesh » Ananthapuram
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.
ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా ఈనెల 7న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అణగదొక్కాలని చూస్తే సహించబోమనీ, చేనేత కులాల సత్తా ఏంటో చూపుతామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉద్ఘాటించారు. స్థానిక శివానగర్లోని శివాలయం వద్ద పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఎమ్యెల్యే కందికుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చట్ట విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ చేసేవారిని జైలుకు పంపాలని కలెక్టర్ వినోద్కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. లింగనిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేద్దామని గైనకాలజిస్టు బాలాకుమారి పిలుపునిచ్చారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఐద్వా, ఎస్ఎ్ఫఐ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో సదస్సు నిర్వహించారు.
నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు గడువులోగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అనంతపురం బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోర్టు వద్ద నుంచి క్లాక్ టవర్ మీదుగా డీఐజీ కార్యాలయం వరకు వెళ్లారు.
వన హాస్పిటల్ వన విలేజ్లో ప్రతిఒక్కరికీ ఉచితంగా వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టరు వినోద్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయుష్మానభారతపై శుక్రవారం ఆయన సమీక్షించారు.
అగ్రిగోల్డ్ భూముల్లో వచ్చే ఆదాయాన్ని ఏటా చెరి సగం పంచుకుందామని విజయవాడలోని ఓ అధికారికి వైసీపీ నాయకుడు బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.
రేషన బియ్యం సక్రమంగా అందడం లేదంటూ పట్టణంలోని 10వ వార్డు మహిళలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు.