Home » Andhra Pradesh » Chittoor
ఎన్నికల్లో కష్టపడిన నేతలను ఎమ్మెల్యేనే పట్టించుకోకుంటే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని పలువురు టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
అన్ని రంగాల్లో భాగస్వాములౌతున్న మహిళలకు మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు గోకులం షెడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ నిర్మించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది.
అయిదేళ్లపాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కుప్పం నియోజకవర్గం తేరుకోవడం ప్రారంభమైంది. వైసీపీ పాలననాటి వివక్షాపూరిత వైఖరినుంచి బయటకు వచ్చి టీడీపీ పాలనలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపుగా పరుగులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరవడమే కాక, ఆయా నిధులతో పనులు కూడా ప్రారంభమై కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడం మొదలైంది.
కాసుల లేమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న గ్రామపంచాయతీలకు మరింత ఉపశమనం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో జిల్లాపరిధిలోని గ్రామపంచాయతీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తొలివిడత 15వ ఆర్థిక సంఘ నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 697 పంచాయతీలుండగా ఎన్నికలు జరగని 13 పంచాయతీలు మినహా 684 పంచాయతీలకు రూ.30,32,73,720 మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రానికి ఆదేశాలందాయి.ఆ నిధుల్లో టైడ్ గ్రాంట్ కింద రూ.18,19,64,239, అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ.12,13,09,481 వెరసి మొత్తంగా రూ.30.32 కోట్లు విడుదలయ్యాయి.
చిత్తూరు జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, , ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 285 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీరి గణాంకాల్లో చేరనివి ఇంతకు పదింతలుంటాయని అంచనా.
కుర్చీమీద ఉన్నపుడు ఒక తీరు.. దిగిపోతే ఇంకో తీరా? అధికారంలో ఉన్నపుడు విపక్షాల మీద నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడారు. వారి కుటుంబాలనూ సోషల్ మీడియా బజారుల్లోకి ఈడ్చారు. ఆడవాళ్ల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఫోటోలు మార్ఫింగ్ చేశారు. వాయిస్ మార్చేశారు. అతుకులు వేసి అబద్ధాలు సృష్టించారు. గోబెల్స్‌ను తలదన్నేలా ప్రవర్తించిన నాయకుల నోట ఇప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ గురించిన ప్రవచనాలు వినిపిస్తున్నాయి. మీడియాను అణగదొక్కేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు.
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడుతున్నారని ఆమె ఆగ్రహించారు.
రూ. 30 లక్షల నగలు, మోటర్‌సైకిళ్ల స్వాధీనం