Home » Andhra Pradesh » Chittoor
‘ఆస్పత్రిలో చైర్మన్ కారుకే అడ్డు వస్తావా? అసలు ఆస్పత్రిలోకి ఆటోను ఎవరు అనుమతించారు?’ అంటూ రోగిని తీసుకువచ్చిన ఆటో డ్రైవరుపై రుయా హెచ్డీఎ్స సభ్యుడు బండ్ల లక్ష్మీపతి బుధవారం విరుచుకుపడ్డారు.
‘వర్కింగ్ చైర్మన్ హోదాతో నా పేరు లేకుండా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తారా? వెంటనే దానిని తొలగించి.. నా పేరుతో ఏర్పాటు చేయండి’ అంటూ రుయాస్పత్రి హెచ్డీఎ్స (హాస్పిటల్ డెవల్పమెంట్ సొసైటీ) సభ్యుడు బండ్ల చలపతి బుధవారం వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
నేలపట్టుకు వలస విహంగాల రాకడ మొదలైంది. సాధారణంగా అక్టోబరు తొలివారంలోనే రావలసిన ఈ పక్షులు కొంత ఆలస్యంగా వచ్చాయి. అయిదు రోజులుగా నేలపట్టు చెరువుల్లోని కడపచెట్ల మీద తెల్ల కొంగలు సందడి చేస్తున్నాయి.
పాలసముద్రం మండలం టీవీఎన్పురం గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ జగన్నాథరాజు కిడ్నాపర్లనుంచి పారిపోబోతూ చనిపోయినట్లు పోలీసులు తేల్చారు.
దాదాపు 65 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి పోగొట్టుకున్నవారికి అందజేశారు.చిత్తూరులో బుధవారం మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ ఆ వివరాలను వెల్లడించారు.
విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడ్డ ఓ కొండచిలువ కలెక్టర్ బంగ్లాకు చేరి హల్చల్ చేసింది. పలుశాఖల అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఐదు గంటలు కష్టపడి రిజర్వుఫారెస్టులో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కుప్పం నియోజకవర్గ గ్రామీణులను ఒంటరి ఏనుగు చాలాకాలంగా వణికిస్తోంది.వారం రోజుల క్రితం కుప్పం మండలంలోని జనావాసాల్లో కనిపించిన ఈ మదపుటేనుగు రామకుప్పం మండలంలోనే నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు రైతులను చంపేసింది.
67మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రెండు కల్వర్టులు కొట్టుకుపోయాయి.
జిల్లాలో 16 రోజులుగా సాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో సోమవారం ఓ హెలికాఫ్టర్ ప్రయాణించడం కలకలం సృష్టించింది.