స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకుసాగుదామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాలులో 20 సూత్రాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
మండలంలో గజదాడులు కొనసాగుతున్నాయి. ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్ట సమీపంలో మంగళవారం రాత్రి మూడు ఏనుగులు వరి పైరును తొక్కేసి, మామిడి తోటల్లో కొమ్మలను విరిచేశాయి. ఎర్రమిట్టకు చెందిన భాస్కర్ నాయుడు విద్యుత్ మోటర్, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి.
జిల్లాలో పెద్ద సంఖ్యలో ఎస్‌ఐలను బదిలీ చేశారు. దీర్ఘకాలికంగా పనిచేయడం, ప్రజాప్రతినిధులతో చిన్నపాటి విభేదాలు, జిల్లాకు కొత్తగా తొమ్మిది మంది రావడం వంటి కారణాలతో ఎస్పీ తుషార్ డూడీ ఎస్‌ఐల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 21 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో తొలి రోజైన బుధవారం టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఐదు కేంద్రాల్లో 800 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా, 78 మంది గైర్హాజరయ్యారు.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ వడివడిగా ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన వద్దకు ఎక్కువ సంఖ్యలో ఫైల్స్ వస్తున్నాయి. ఆరు నెలల్లో ఏకంగా 7,150 ఫైల్స్ వచ్చాయి. రాష్ట్రంలోనే ఇది ప్రథమ స్థానం.జేసీ విద్యాధరి వద్దకూ 4,120 వచ్చాయి.
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.
తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్ భవనంపై నుంచి పడి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.
తిరుపతి, సాయినగర్ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్‌గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకముందు.. ఒడిశాలో బాధితురాలిని విచారించిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు అమ్మవారి ఆలయ పోటు వర్కర్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.