Home » Andhra Pradesh » Chittoor
Andhrapradesh: తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్గా ప్రకటించాలని పలుమార్లు..
చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో బుధవారం పశువుల పండుగ(జల్లికట్టు) నిర్వహించారు. పరిసరాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పశువులను తీసుకొచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ భవనాలకీ, ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లకీ, ఆఖరికి చెట్లకీ, కరెంటు స్తంభాలకు కూడా పార్టీ రంగులేసి నవ్వుల పాలయ్యారు.
కొత్త సంవత్సరమని ఫుల్గా మందేశారు. మద్యం మత్తులో రోడ్డుపైకి వాహనాలు నడుపుతూ వచ్చారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లాలో మందుబాబులు హల్చల్ చేశారు.
కొత్త ఆంగ్ల సంవత్సరాదికి మందుబాబులు ఖుషీ చేశారు. మూడు రోజుల్లో దాదాపు రూ.33.44 కోట్ల మద్యాన్ని తాగారు. ఇందులో డిసెంబరు 31వ తేదీన రూ.13.10 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉండవల్లిలోని నివాసంలో టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు.
నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామునే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి రోజున దైవ దర్శనం చేసుకుంటే ఏడాదంతా మంచే జరుగుతుందన్న భావనతో గుళ్లకు వెళ్లారు.
ఏం జరిగింది? ప్రమాద సమయంలో లోపల ఎంత మంది ఉన్నారు? ఇదీ పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్నలు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్ఆర్కేవీఎం) కిట్లను అందించేందుకుగాను వారి పాదాల కొలతలను నమోదు చేయాలని డీఈవో కేవీఎన్ కుమార్ ఆదేశించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం మరో బంగారుబాబు వచ్చారు. కర్ణాటకకు చెందిన రవి ఐదు కేజీల బంగారు ఆభరణాలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు.