తిరుమలలో ఈనెల 16న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది.
రోడ్డుపై బోల్తా పడ్డ లారీని చూస్తున్న వారిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.కార్వేటినగరం మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
జిల్లావ్యాప్తంగా ఉన్న 88 ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాల అమలు తీరు పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో శుక్రవారం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. కలెక్టరేట్లో నిర్మించిన నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.1,72,10,021 ఆదాయం లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో స్వామి కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు.
విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని తెలియజేయడమే మెగా పీటీఎం 3.0 లక్ష్యమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.జిల్లా విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెగా పేరెంట్, టీచర్స్ మీటింగులు నిర్వహించారు.
జిల్లా విభజన తర్వాత జడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని సభ్యులు సమస్యలపై ఎవరితో చర్చించాలో తెలియని పరిస్థితి నెలకొంది.
పరకామణి దొంగతనాన్ని చాలా చిన్నదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తిరుపతిలోని కూటమి నేతలు శుక్రవారం ఆయనపై ధ్వజమెత్తారు. ‘పరకామణి’తో పరాచకాలేంటి జగన్ అంటూ ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్ ఇచ్చింది.