Home » Andhra Pradesh » East Godavari
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..ఎటు చూసినా ఇవే హోర్డింగ్లు.. ఏ షాపు వద్ద చూసినా పెద్ద ఎత్తు న ఆఫర్లు.. ఒకటి కొంటే రెండు ఉచితం.. రెండు కొంటే నాలుగు ఉచితం.. ఎంత కొంటే అంతా ఫ్రీ..ఇలా అంటేనే జనం ఎగబడుతున్నారు..
పండుగకు వెళ్లాలి ఎలాగైనా.. ఇదీ ప్రతి ఒక్కరి ఆశ.. ఈ ఆశనే కొందరు క్యాష్ చేసు కుంటారు.. ప్రతి ఏడాది ఇంతే.. ఈ ఏడాది జరుగుతున్నది ఇదే.. హైదరాబాద్.. బెంగళూరు.. చెన్నై.. పుణె ఇలా ఏ పెద్ద నగరంలోనైనా గోదావరి జిల్లాల వాళ్లు ఉండకుండా ఉండరు.. వీళ్లంతా కుటుంబంతో కలిసి ప్రతి ఏడాది పండుగకు వస్తారు.. స్వగ్రామాల్లో ఆనందంగా గడిపి వెళ్లిపోతారు.. ప్రస్తుతం అక్కడి నుంచి రావడమే గగనంగా మారింది..
దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని రాయవరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వరాహ అవతారంలో పూజలందుకున్నారు.
విద్యుత్ శాఖ ఆధునీకరణవైపు వడివడిగా పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా వీటిని తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా ఎట్టకేలకు విద్యుత్ స్మార్ట్మీటర్లను రంగంలోకి దించారు.
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం బుధవారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది.
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించారు. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో 11 ప్రభల ఉత్సవ కమిటీ సమావేశం శ్రీపాద వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కూటమి నాయకులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 166 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండటంతో వీటిలో ముగ్గురు సభ్యులను నియమించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాలక వర్గాలను దక్కించుకోవడం కోసం నియోజకవర్గ శాసన సభ్యుల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు.
విద్యార్థి దశ నుంచి పరిశోధనా శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా మండలస్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి చేయాలని బుధవారం ఆదేశించారు.
అనధికార ఇసుక ర్యాంపుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. సోమవారం ప్రముఖ దినపత్రికల్లో ప్రచురి తమైన వార్తా కథనాలపై స్పందించిన అధికారులు స్థానిక సచివాలయంలో అనుమతులు తీసుకోవాలని ఆంక్షలు విధించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.