Home » Andhra Pradesh » East Godavari
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది.ధాన్యం విక్ర యాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థ లను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభు త్వం వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయిం చేలా ప్రత్యేక నెంబరును అందుబాటు లోకి తెచ్చింది.
వంగలపూడి 1,2 ఇసుక రీచ్‌లు రద్దుచేస్తున్నట్టు జేసీ చినరాముడు ప్రకటించారు. వంగలపూడ ఇసుక ర్యాంపు వద్ద స్థానికులకు, యాజమాన్యానికి మధ్య ధరల విషయమై గొడవ జరిగిన నేపథ్యంలో బుధవారం జేసీకి వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా ఫిర్యాదులు చేశారు.
వైసీపీ హయాంలో అంతా వారిష్టమే.. కావాలంటే పను లు చేశారు.. లేదంటే బిల్లులు చేయించేసుకున్నా రు..ఎక్కడికక్కడ ఆక్రమించేసి ఇష్టానుసారం భవ నాలు నిర్మించేసుకున్నారు. అయినా అడిగే నాథు డు లేదు..
: వీవోఏ(యానిమేటర్ల)లకు రావాల్సిన ఎనిమిది నెలల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు
తెలగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అమలాపురం గండువీధిలోని డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపం వద్ద బుధవారం కాపు కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు.
జిల్లాలో 1.57లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేపట్టగా ఇప్పటి వరకు 48వేల ఎకరాల్లో వరి కోతలు 30శాతం పూర్తి అయిన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు ప్రతీ నెల పెన్షన్ తీసుకోవాల్సిందే. ఒక నెల అందుబాటులో లేకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్ వచ్చేది కాదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక నెల పెన్షన్ నగదు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తర్వాత నెల పెన్షన్‌తో కలిపి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కో సందర్భంలో రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం నగదును అందజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కాకినాడ: పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ ఏపీ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్‌లో పనిలో పెట్టుకున్న యజమాని పని చేయించుకుని సరిగా భోజనం పెట్టక చిత్రహింసలకు గురి చేస్తుండటంతో.. ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకనాడు గోదావరి కాలువల్లో నీటిని చేతితో ఒడిసిపట్టి తాగేవాళ్లం.. ఇప్పుడు ఆ నీరు తాగాలంటేనే భయమేస్తోంది.. ఇదీ ఒక 70 ఏళ్ల పెద్దాయన మాట.. మేం గతంలో గోదావరి కాలువల నీటినే బిందెలతో తెచ్చుకుని తాగేవాళ్లం.. ఇప్పుడు నీటిని కొనుక్కుని తాగుతున్నాం.. ఇదీ 60 ఏళ్ల బామ్మ మాట.. ఎందుకంటే నాటికి నేటికి గోదావరి కాలువల నిర్వహణలో ఎంతో తేడా ఉంది.
వారిద్దరూ ఐఏఎస్‌లు.. ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. కొత్తపేట మండలం బిళ్లకుర్రులో రిసెప్షన్ వేడుక నిర్వహించారు.