Home » Andhra Pradesh » East Godavari
సామాజిక మాధ్యమాలను కొందరు దుర్వినియో గం చేస్తున్నారు. రాజకీయ ప్రచారానికి వినియోగించడంతోపాటు ప్రత్యర్థులు, వారి కుటుంబీకులు, ఆ కుటుంబాల మహిళలు, చిన్నపిల్లలపై బూతులతో విరుచుకుపడుతున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలతో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) చీఫ్గా నియమితులైన కె.సంజయ్మూర్తికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన తండ్రి విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఎస్సార్ మూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం లోక్సభ రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.
శాంతికోసం ఒక ప్రదేశం అనే సందేశాత్మక నినాదంతో 2024లో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళుతున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ అధ్య క్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం విభాగం సమావేశం నిర్వహించారు.
సారా అమ్మ కాలు, బెల్టు షాపుల నిర్వహణ, రేకా జూదాల వంటి చట్ట వ్యతి రేక కార్యక్రమాలపై వీటికి పాల్ప డే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని జిల్లా ఎస్పీ నర శింహ కిషోర్ హెచ్చరించారు. తాళ్లపూడి పోలీసు స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డు లను పరిశీలించారు.
ఇక నుంచి జిల్లా వ్యా ప్తంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఏఎస్వో ఎం.నా గాంజనేయులు తెలిపారు.
గ్రామాల్లో ప్రజారోగ్యం కోసం కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు సూచించారు.
మలికిపురం ఎఫ్డీటీ జూనియర్ కళాశాల విద్యార్థి రామేశ్వరవరపు జయసాయి యువ రాజును గాయపర్చిన కేసులో నలుగురి యువ కులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పి.సు రేష్ తెలిపారు.
పవిత్రగోదావరి పుష్కరాలు 2027లో రాజమహేంద్రవరం కేంద్రంగా జరుగబోతున్నాయి. వాటికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది.
అంతర్వేది గొంది గ్రామంలో అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు.
యానాం నియోజకవర్గంలో ఓఎన్జీసీ నుంచి రావాల్సిన మొత్తం నష్టపరిహారం పూర్తిగా విడుదలైందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు.