Home » Andhra Pradesh » Guntur
జంట హత్యల కేసులో తప్పించుకు తిరుగుతున్న వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోవాలని వారు నిర్ణయించుకున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మాజీ మంత్రి వివేకా నందరెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీబీఐ కోర్టు ఇవాళ(బుధవారం) కీలక తీర్పు వెల్లడించనుంది.
పల్నాడు జిల్లా మాచవరం పరిధిలో 2021లో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేబినెట్ మంత్రులు, కార్యదర్శులతోపాటు సచివాలయంలోని వివిధ విభాగాల అధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఈ సమావేశం జరగనుంది.
జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే వారిని నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పారు.
ఇండిగో సంస్థతో ప్రభుత్వ పరంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విమానాలు రద్దయ్యాయన్నారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.