Home » Andhra Pradesh » Guntur
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పరిశ్రమ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది.
వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని ఎర్నీ బదలబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఇతర మంత్రులతో సహా వారి కుటుంబాల్లోని మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరాచక శక్తులను గుర్తించి కేసులు పెడుతున్నారు.
బీసీ జనాభా శాతం ఎంత అనే విషయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టంగా పేర్కొంది. మొత్తం 138 బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, వీరిని ఐదు గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-ఏ, బీ, సీ, డి, ఇ వర్గాలుగా ..
అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చారు.
అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్‌కు లేవని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్లో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.