Home » Andhra Pradesh » Guntur
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ క్యాబినెట్లో ఈ సమస్యపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చర్చలేవనెత్తారు. ఇంట్లో ఉన్న ఆడివారిని సైతం వదిలిపెట్టకుండా సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
డిసెంబర్ 31 నుంచి జనవరి మెుదటి వారం వరకూ గ్రీటింగ్ కార్డుల పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు, మెయిల్స్‌ను సైబర్ కేటుగాళ్లు పంపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు మీ పేరుతో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపాలనుకుంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలంటూ మెసేజ్‌లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.
Minister Nimmala Ramanaidu: గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మంత్రి నిమ్మల రామానాయడు విమర్శించారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్‌లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నెలకో జిల్లా చొప్పున పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు.
Minister Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు చెల్లించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Kolusu Partha Sarathy: ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్‌గా సీఎం చంద్రబాబు మార్చారని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు రూ.1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
CM Chandrababu: విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు చెప్పారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని అన్నారు. ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని చెప్పారు.
సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలు ప్రయాణం కోసం నానావస్థలు పడతారు. అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Minister Sandhya Rani: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు.